చేజారిపోయిన,తర్వాత అనుకుంటారు,నేను ఇలా అనుకోలేదు, ఇంత దూరం వస్తుంది, అనుకోలేదు.

 చేజారిపోయిన తర్వాత అనుకుంటారు,

నేను ఇలా అనుకోలేదు,ఇంత దూరం వస్తుంది, అనుకోలేదు.

------------------------------


మనిషి బ్రతికినంత కాలం 

వీటి విలువ ఎందుకు తెలియదు,

చేజారిపోయిన తర్వాత వీటి విలువ తెలిసి వస్తుంది. అప్పుడు ప్రయోజనం కూడా ఉండదు. ఏదైనా ముందే తెలియాలి.

చేజారిపోయిన తర్వాత అనుకుంటారు, 

నేను ఇలా అనుకోలేదు 

ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. 

లేకపోతే ముందే జాగ్రత్త పడే వాడిని, తప్పు జరిగిపోయింది అని అనుకుంటారు. కానీ 

అప్పటికి చేసేదేముండదు, జరగవాల్సిందంతా జరిగిపోతుంది. 

జరగకముందే ఈ కాస్త టైములోనే మేల్కోవాలి.

చేజారి పోకముందే దానికి కాపాడుకోవాలి.

ఇలాంటి టైం లోనే ఈగో అహం బయటకు వస్తుంది. 

నేను వెళ్ళను నేను రాను నాకు అవసరం లేదు,

పంతాలు బయటకు వస్తాయి.

పట్టింపులు బయటకు వస్తాయి. 

ఎదుటివారు అన్న మాటలు గుర్తుకు వస్తాయి, అయినా ఏమీ పట్టించుకోకూడదు. 


అందుకే

తల్లి విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి. 

తండ్రి విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

చదువు విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

ప్రేమ విషయంలో చేజారి పోకముందే తెలుసుకోవాలి.

చేసే పని విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

ఉద్యోగం విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

భార్య విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి. 

భర్త విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

రక్తసంబంధం విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

ఆరోగ్యం విలువ చేజారి పోకముందు తెలుసుకోవాలి.

జీవితం విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

స్నేహితుల విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

డబ్బుల విలువ చేజారి పోకముందు తెలుసుకోవాలి.

ఆస్తిపాస్తులు విలువ చేజారిపోకముందే తెలుసుకోవాలి.

సంబంధాల విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

బంధాల విలువ చేజారి పోకముందు తెలుసుకోవాలి.

మనుషుల విలువ చేజారి పోకముందే తెలుసుకోవాలి.

ఇవి ఉన్నప్పుడు వీటి విలువ తెలియదు, 

వీటి విలువ ముందే తెలిసే అవకాశం లేదు. 

నిర్లక్ష్యం, ఎక్కడికి వెళుతుంది, అనే ఆజాగ్రత్త.

చేజారిపోయిన తర్వాత ఎంత ఏడ్చిన ఎంత బాధ పడ్డా ప్రయోజనం ఉండదు. అందుకే ముందు మేల్కోవాలి.

ఒకవేళ ఎవరైనా చెప్తారు, ఇది చేయకు, అది చేయకు, అది చూడకు, అటు వెళ్ళకు, ఇది మంచిది కాదు, అని ఎంతో మంది చెప్తారు. కానీ అది చెవుల వరకు మాత్రమే వెళుతుంది, తలకాయ లోపాటికి వెళ్ళలేదు. అందుకే ఎవరెన్ని చెప్పిన మనం పట్టించుకోము. అందుకే

ఉన్నప్పుడు వాటి విలువ తెలిసి రాదు. చేజారిపోయిన తర్వాత తెలిసి వచ్చిన ప్రయోజనం ఉండదు. 

అందుకే ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది కదా ,చేజారి పోకముందే మన నుండి వెళ్లిపోక ముందే, మన నుండి దూరం కాకముందే, మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.

మంచి భార్యను వదులుకోకూడదు. ఎన్ని కష్టాలైనా సరే మనం భరించి కాపాడుకోవాలి.

మంచి భర్తను వదులుకోకూడదు, ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చిన సరే, మంచి భర్తను కాపాడుకోవాలి.

మనకు మంచి పని దొరికింది దాన్ని వదులుకోకూడదు, ఎంత కష్టం వచ్చినా,

మంచి వ్యక్తులను వదలకూడదు. ఎంత కష్టమొచ్చినా బాధపడ్డ మన నుండి వేరు కానివ్వకూడదు.

మంచి వాళ్లను, మంచి వస్తులను ,మంచి పనిని, ఆస్తిపాస్తులను, ఏదైనా సరే, మన వద్ద ఉన్నది తల్లిదండ్రులు, భార్య పిల్లలు, ఆస్తిపాస్తులు, ఏదైనా సరే, మన వద్ద ఉన్నదానికి విలువ గౌరవం మర్యాద ఇస్తూ ఉండాలి. కాపాడుకుంటూ ఉండాలి.

చివరివరకు

ఒకవేళ మన ప్రమేయం లేక వెళ్ళిపోతే వెళ్ళిపోని, కానీ మన చేతిలో ఉన్నంతవరకు మన పక్కన ఉన్నంతవరకు మన మధ్యన ఉన్నంతవరకు ప్రతి ఒక్కదాని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దేన్ని నిర్లక్ష్యం చేయకూడదు దేన్ని తేలికగా తీసుకోకూడదు. 

ప్రతి ఒక్కదాని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. వస్తువులు అయినా, బంధమైన, సంబంధం అయిన ,ఆస్తి పాస్తులు అయిన, ఆరోగ్యమైన, ఏవైనా సరే దూరం కాకముందే, ముందే అన్ని జాగ్రత్త పరుచుకొని సవరించుకోవాలి.

మనిషి జీవితంలో ఒక విచిత్రమైన నిజం ఉంది. 

మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు; అవి చేజారిపోయిన తర్వాత మాత్రం వాటి అసలు విలువ అర్థమవుతుంది. 

ఈ పరిస్థితి దాదాపు ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. కానీ ఆ సమయంలో తెలిసే జ్ఞానం, ఆ బాధ, ఆ పశ్చాత్తాపం… మనకు ఎలాంటి ప్రయోజనం ఇవ్వదు. 

ఎందుకంటే అప్పటికే ఆలస్యం అయిపోతుంది.

ఇది ఎందుకు జరుగుతుంది? కారణం చాలా సరళమైనది అనుభవం. మనం స్వయంగా అనుభవించని విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. 

.

Comments

Popular posts from this blog

AP SSC -2026 Results download direct Link

AP SSC EXAM HALL TICKETS DOWNLOAD DIRECT LINK

AP inter results Download Direct Link