A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

ఆంధ్ర ప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు- 1996
సీనియారిటీ -ప్రమోషన్స్- రిజర్వేషన్లు
ఉద్యోగులు ఎక్కువ సందేహాలు వచ్చేది సీనియారిటీ మరియు ప్రమోషన్ల విషయంలోనే గౌరవ హైకోర్టు wp21718 బార్ 2022 పిటిషన్ పై తేదీ 02 08 2023 రిజర్వేషన్ల అమలుకై ఇచ్చిన తీర్పు ఫలితంగా ఇటీవల ప్రభుత్వం ప్రమోషన్ లో రిజర్వేషన్ల విధానాన్ని మౌలికంగా ఈ విధంగానే ఉంచి రోస్టర్ కేటాయింపులో కొంత మార్పు చేసింది ఈ రెండు విషయాలపై అవగాహన కోసం క్రింది వివరణ ముందుగా సీనియారిటీ గురించిన వివరణ
సీనియారిటీ:
33-(ఎ)ఒక ఉద్యోగి యొక్క సీనియార్టీ తాను ఒక సర్వీస్ క్లాస్ /కేటగిరిలో మొదటగా నియమాకం అయిన తేదీ ప్రకారం నిర్మించబడుతుంది.
బి) ఒకవేళ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకేసారి నియమించబడినట్లయితే రిజర్వేషన్ నియమాలు (రోస్టర్ జాబితా తయారీ) లేదా ఇతర కారణాలతో నియమాక అధికారి నిర్ణయించిన ప్రాధాన్యత ప్రకారమే సీనియారిటీ నిర్ణయించబడుతుంది.
(సి).అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఇతర ప్రాధికారికం ఎంపిక చేసినప్పుడు వారి జాబితాలో సూచించబడిన మెరిట్ లేదా ప్రాధాన్యత క్రమం ప్రకారమే, సీనియారిటీ ని నిర్ణయించబడుతుంది.
డి). ఉద్యోగి ఒక సర్వీస్ లోని ఒక క్లాస్ / కేటగిరి నుండి సమాన వేతన స్కేలు గల మరొక క్లాస్ / కేటగిరి కి బదిలీ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క సీనియారిటీ మొదటి క్లాస్/కేటగిరిలో రెగ్యులరైజ్ అయిన తేదీ నుండి నిర్ణయించబడుతుంది.
34. ఉమ్మడి సీనియారిటీ జాబితా తయారు చేయడం.
వివిధ యూనిట్లకు చెందిన ఉద్యోగుల ఉమ్మడి సీనియారిటీ జాబితా వారి వారి యూనిట్ల సీనియారిటీ జాబితాకు భంగం కలగకుండా పైన సూచించిన 33(a) నిబంధన ప్రకారమే తయారు చేయబడుతుంది.
35.అభ్యర్థనపై లేదా అడ్మినిస్ట్రేటివ్ ప్రాతిపదికన బదిలీల విషయంలో సీనియర్ నిర్ణయించడం:
ఎ) ఒక సర్వీస్/ క్లాస్/ కేటగిరి లో పనిచేయుచున్న ఉద్యోగి పరిపాలన కారణాలు అనగా (Administrative grounds) పై ఒక యూనిట్ నుండి మరొక యూనిట్ కి బదిలీ చేయబడినప్పుడు, వారి సీనియారిటీ మునుపటి యూనిట్ లోని నియమాకం తేదీ నుండే పరిగణించబడుతుంది.
బి).అదే బదిలీ ఉద్యోగి కోరిక మేరకు (Request transfer) జరిగితే కొత్త యూనిట్ లో విధుల్లో చేరిన తేదీ ప్రకారం నిర్ణయించబడుతుంది.
36. ప్రొబేషన్ ప్రారంభ తేదీలు ఒక్కటి గా ఉన్నప్పుడు సీనియారిటీ:
(i).APPSC/ ఇతర ఎంపిక సంస్థ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా నియమాకం తేదీతో సంబంధం లేకుండా వారికి కేటాయించిన ర్యాంకింగ్ కు ప్రకారమే ఉండాలి.
(ii).పదోన్నతి పొందిన వారి విషయంలో ప్రొబేషన్ ప్రారంభ తేదీలు ఒకటే ఉన్నప్పుడు వయసు ఎక్కువ ఉన్న వ్యక్తి సీనియర్ అవుతాడు.
సీనియారిటీ లిస్టు:
ఒకేసారి డీఎస్సీ(DSC)లో సెలెక్ట్ కాబడిన వారందరి విషయంలో ఉద్యోగంలో చేరిన తేదీతో నిమిత్తం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్ (Merit Cum Roster Register) పద్ధతిలో సీనియారిటీ లిస్టులు తయారు చేయాలి.
స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిచ్చిన CDSE procs. RC.No ESE02-14028/1/2022-E-VI,DTD.30-09-2022),
డీఎస్సీ(DSC) పరీక్షలో లభించిన మార్కులు S.C,S.T.,B.C.లకు కేటాయించిన రోస్టర్ ప్రకారము చేసిన జాబితానే మెరిట్ కమ్ రోస్టర్ జాబితా (MERIT CUM ROSTER REGISTER)అంటారు.
పైన తెలిపిన APSSS RULES 33 నుండి 37 వరకు MERIT CUM ROSTER ప్రకారం సీనియార్టీ లిస్టులు ఎలా తయారు చేస్తారో తెలుస్తుంది.
*పాఠశాల విద్యాసంచాలకుల వారి ఉత్తర్వులు*
R.C.No:7933/C2-2/2001Date:28-12-2001. ప్రకారం లేదా SGT తత్సమాన కేటగిరీల నుండి స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేటగిరి లకు పదోన్నతి పొంది 15 రోజుల లోపల విధుల్లో చేరినప్పుడు,చేరిన తేదీలతో నిమిత్తం లేకుండా ఫీడర్ కేటగిరీ సీనియారిటి ప్రకారమే ప్రమోషన్ క్యాడర్ లోని సీనియారిటీ నిర్ణయించబడుతుంది.
సీనియారిటీ ప్రకారం Attendance Register ఉపాధ్యాయుల పేర్లను వ్రాయాలి పాఠశాల విద్యా సంచాలకుల వారి ఉత్తర్వులు L.Dis.No.1709/C3-1/2005.Date,:01-12-2005.
ప్రమోషన్లు రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 5
తేదీ: 14- 2-2003 ప్రకారం పదోన్నతుల పోస్టుల యందు కూడా ప్రభుత్వంలోని అన్ని శాఖలలోని అన్ని కేటగిరి పోస్టులలో
15% SCలకు, 6% STలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఇందులోని ప్రతి 3 పోస్టులలో ఆయా కేటగిరి మహిళలకు ఒక పోస్ట్ కేటాయించబడినది.ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు
G.O.Ms.No: 21 Dt: 18 -3 -2023 ద్వారా విడుదలైనవి.శారీరిక వికలాంగులకు [person with Bench mark Disability (PBD)] 4% (అంధత్వం లేదా తక్కువ చూపు,చెవిటి లేక మూగ, అంగవైకల్యం, ఆటిజం లకు 1% చొప్పున) కూడా రిజర్వ్ చేయబడినవి.( G.O.Ms.No:42 Dt : 19-10 -2011 Read with G.O.Ms.No:02 WCD & S. Dept Dt:19 -02-2020). BC లకు జనరల్ మహిళలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయలేదు.
ప్రమోషన్ లో రిజర్వేషన్లు Adacqucy నిబంధనల మేరకు వర్తిస్తాయి.
"Adacqucy "అంటే ఒక కేడర్ పోస్టులకు సంబంధించి, ఆ కేడర్లో SC,ST,PH, అభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజ్ మేరకు ఇప్పటికే పని చేస్తూ ఉంటే ఆ కేడర్లో Adacqucy చేరుకున్నట్లు" Adacqucy చేరుకున్న తర్వాత ప్రమోషన్ లో రిజర్వేషన్ వర్తించదు. ఇక వారి పాయింట్లు అన్ని జనరల్ కిందకు మారుతాయి. అప్పుడు అందరిని కలిపి కామనగా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియార్టీ లిస్టు తయారుచేసి పదోన్నతులు ఇస్తారు.
(G.O.Ms.No.2 date: 09-01-2004) and (G.O.Ms.No:18 Dt:17-02-2005)
పదోన్నతులలో SC,ST,& PBD కేటగిరీలలో అర్హులు దొరకనట్లయితే సంబంధిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు "బ్యాక్ లాగ్" ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డి- రిజర్వ్ చేసి జనరల్ అభ్యర్థులతో భర్తీ చేసి, తదుపరి సంవత్సరం మరల అన్నే పోస్టులను యధావిదంగా "బ్యాక్ లాగ్" గా ఉంచాలి.
రిజర్వేషన్లు వర్గీకరణ -
నిలువు (Vertical) మరియు సమాంతర (Horizontal) రిజర్వేషన్లు.
(G.O.Ms. No: 77 GAD Dt:2-8-2023)
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ప్రకారం SC ,ST మరియు BC లకు అనుకూలంగా ఇచ్చిన సామాజిక రిజర్వేషన్లు
నిలువు (VERTICAL) రిజర్వేషన్లు ,
SC/ ST/ BC లు వారి సొంత మెరిట్ ద్వారా బహిరంగ పోటీ (Open Competition) ఖాళీలకు ఎంపిక చేయబడితే వారికి రిజర్వ్ చేసిన పోస్టుల కోటా భర్తీ చేయబడిందని చెప్పలేము.ఆయా కేటగిరీల వారికి వారి కోటా సీట్లు చెక్కుచెదరకుండా ఉంటాయి.
రాజ్యాంగం లోని ఆర్టికల్ 16(1)లేదా 15(3) కింద శారీరక వికలాంగులు (ఇకనుండి Person with Benchmark Disability గా పిలువబడతారు), మహిళలు మొదలైన వారికి కేటాయించిన ప్రత్యేక రిజర్వేషన్లు సమాంతర (Horizontal) రిజర్వేషన్లు ,నిలువు రిజర్వేషన్ లకు (Vertical)కు వర్తించే పైన పేర్కొన్న కోటా సూత్రం,ఈ రిజర్వేషన్లకు వర్తించదు. ఉదాహరణకు షెడ్యూల్(S.C) కులాలకు కేటాయించిన రిజర్వేషన్ లో మహిళలకు 33 1/3% ప్రత్యేక రిజర్వేషన్ కల్పించబడినప్పుడు, S.C(G)జనరల్ లో వారి కోటా పూర్తి చేసి ఉంటే ఇక S.C(W)మహిళలకు ప్రత్యేక పాట కోటా ఏమీ ఉండదు. ఏదైనా లోటు ఉంటే మాత్రమే, ఆమేరకు S.C పురుష అభ్యర్థులను తొలగించి S.C(W)మహిళలకు అవకాశం ఇస్తారు.ఇదే సూత్రం S.T(W) మహిళలకు వికలాంగులకు(PBD)కు రిజర్వేషన్ లకు వర్తిస్తుంది.అంటే ఒక నిర్దిష్ట ప్యానెల్ లో సీనియార్టీ ద్వారా P.B.D.లకు ప్రమోషన్ వచ్చి ఉంటే ఇక P.B.D. ప్రత్యేక కోటా ద్వారా భర్తీ చేయరు.కారణం ఏమిటంటే S.C/S.T/P.B.D అలాగే మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లు అంటూ ఏమీ లేవు. G.O.Ms.No: 77 GAD Dt:2-8-2023 ద్వారా రోస్టర్ లిస్టునకు చేసిన సవరణ ఫలితం ఇది.
ఈ ఉత్తర్వు ద్వారా ప్రమోషన్ కోసం ప్రభుత్వం కొత్త రోస్టర్ లిస్టు విడుదల చేసింది. అందులో మహిళలకు P.B.D.లకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లు లేవు. BC లు నిలువు (Vertical) రిజర్వేషన్ లకు అర్హత ఉన్నప్పటికీ వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్ లేదు.కనుక వారి పాయింట్లను O.C పాయింట్లుగా చూపడం జరిగింది.
కింద ఒక జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) ప్రమోషన్ కోసం 25 పోస్టు ఖాళీల వరకు తయారు చేయబడిన Panel గమనించండి. ఈ పట్టికలోని ఉదాహరణలోని పేర్లు వారి Cast, కేటగిరీలు ఊహాజనితాలే.
ఈ పట్టికలో రెండవ కాలంలో S.C,S.Tలకు మాత్రమే రోస్టర్ పాయింట్లు ఉండడం మహిళలకు,P.B.D (శారీరక వికలాంగులకు) ఎటువంటి పాయింట్లు లేవన్న విషయం గమనించండి. రెండవ కాలంలోని ఖాళీని 4,5 కాలంలో నమోదైన వ్యక్తులు వారరి Cast కేటగిరి దృష్టిలో పెట్టుకొని ఎలా సర్దుబాటు (Accommodate)చేసి జాబితాలో పొందుపరిచారో పరిశీలిస్తే అర్థమవుతుంది. S.C,S.Tలకు ఇంకా"Adaquacy " చేరుకోలేదని భావించి కింది జాబితా
G.O Ms. No: 26 Dt: 20-02-2009 ప్రకారం S.C,S.T ఉద్యోగులకు రిజర్వేషన్ వల్ల ప్రమోషన్ వస్తే మాత్రమే తదునుగుణంగా వారికి సీనియార్టీ కూడా ఇవ్వబడుతుంది. (Reservation shall be implemented with consequential seniority).
వికలాంగులకు సంబంధించి 1- 25 ఖాళీలలో ఎవరైనా P.B.Dలు ఉంటే ముందుగా ప్రమోషన్ వారికి ఇచ్చి భర్తీ చేస్తారు. తిరిగి వారి కోటాను 26-50 పాయింట్ల మధ్య పరిశీలిస్తారు.
G.O.Ms No: 77 GAD Dt: 2-8-2023 ప్రకారం ఇది సమాంతర రిజర్వేషన్ కనుక అందులో ఉండే
పేరా 3 (c)(ii) ప్రకారం SC/STలకు ఉండే (consequential seniority) అవకాశం PBD లకు ఉండదు. ఆ విధంగా P.B.D లకు మాత్రమే సీనియార్టీ రక్షించబడదు.క్రింది కేడర్ లో ఏ సీనియారిటీ ఉంటే పై పోస్టులోనూ అదే సీనియారిటి ఇస్తారు.
Comments
Post a Comment