A.P-S.S.C-2025 RESULTS Download Direct Links;

*సందేహాలు - సమాధానాలు*
〰〰〰〰〰〰〰〰
1. ప్రశ్న : *ఒక ఉపాధ్యాయుడు అప్రెంటీస్ కాలంలో 50 రోజు లు జీతనష్టపు సెలవు పెట్టుకుని ఇన్-సర్వీస్ BEd కి వెళ్ళారు. అప్రెంటీస్ కాలంలో జీత నష్టపు సెలవు వాడుకోవచ్చునా? సదరు కాలాన్ని నోషనల్ ఇంక్రిమెంట్ కు పరిగణిస్తారా?*
- జవాబు: *అప్రెంటీస్ కాలంలో జీత నష్టపు సెలవు పెడితే ఆ మేరకు అప్రెంటీస్ పీరియడ్ పొడించబడుతుంది.*
★★★★★★★★★★★★
2. ప్రశ్న: *ప్రభుత్వ అనుమతితో 16.03.2024 నుండి విదేశా లకు వెళితే వేసవి సెలవుల అనంతరం జాయిన్ అయితే వేసవి సెలవులకు అనుమతిస్తారా?*
- జవాబు: *16.03.2024 నుండి వేసవి సెలవుల ముందు రోజు వరకు సెలవు మంజూరు చేస్తారు. వీటిని వేసవి సెలవులకు సఫిక్స్ గా వాడుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేయాలి.*
★★★★★★★★★★★★
3. ప్రశ్న: *హైస్కూల్ ప్లస్ లో పనిచేస్తున్న పిజిటి లకు ఇచ్చిన. ఇంక్రిమెంట్ మూలవేతనంలో కలపవచ్చా?*
- జవాబు: *హైస్కూల్ ప్లస్ లో పనిచేస్తున్న పీజిటి లకు ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ డిటిఏ ఇచ్చిన ఉత్తర్వులు మేమో N0. Fin 02-18069/10/2024-SEC-DTA, DE 16.02 2024 నందు సదరు ఇంక్రిమెంట్ వారి మూలవేతనంలో కలపరాదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.*
★★★★★★★★★★★★
4. ప్రశ్న: *ఉద్యోగ విరమణ ఉపాధ్యాయుడు 75,000/-ల మెడికల్ రీయింబర్స్ మంట్ ప్రతిపాదనలు ఎలా పంపుకోవాలి?*
- జవాబు: *ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు మెడికల్ రీయింబర్స్మెంట్ ప్రతిపాదనలు ఆన్లైన్ ద్వారా CSE కి పంపుకోవాలి అందుకొరకు cse.ap.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అయి దానిలో ప్రతిపాదనలు అప్ లోడ్ చేయవలసి ఉంటుంది.*
★★★★★★★★★★★★
5. ప్రశ్న: *ఒక ఉపాధ్యాయినికి భర్త మరణించినందున ఫ్యామిలీ పెన్షన్ వస్తున్నది. ఆమె జీతం మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండూ ఆదాయపు పన్నులో చూపించాలా? ఎలా చూపించాలి?*
- జవాబు: *అవును. ఆమె జీతం, పెన్షన్ రెండూ ఆదాయపు పన్ను మదింపు కోసం చూపించాలి. ఫ్యామిలీ పెన్షన్ ను ఇతర ఆదాయంలో చూపించాలి.*
★★★★★★★★★★★★
6. ప్రశ్న: *ఒక ఉపాధ్యాయుడు జనవరి నుండి డిసెంబర్ వరకు సస్పెన్షన్ లో ఉన్నారు. అనంతరం డిసెంబర్ 21న విధులలో చేరారు. సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు సెలవు మరియు సంపాదిత సెలవు మంజూరు చేసారు. అతని ఇంక్రిమెంట్ సెప్టెంబర్ మాసంలో వున్నది. ఇంక్రిమెంట్ ఎప్పుడు మంజూరు చేస్తారు?*
- జవాబు: *సస్పెన్షన్ కాలానికి అర్ధజీతపు మరియు సంపాదిత సెలవు మంజూరు చేసారు కాబట్టి ఆయనకు సెప్టెంబర్ మాసంనుండే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారు. అయితే ఆర్థిక లాభం వారు విధులలో చేరిన డిసెంబర్ 21వ తేదీ నుండి ఇస్తారు.*
★★★★★★★★★★★★
7.ప్రశ్న : *1995 డిఎస్సి ద్వారా SGT గా చేరిన ఉపాధ్యా యుడు 2009లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 4న విధులలో చేరారు. మరొక ఉపాధ్యాయుడు 1996 DSC ద్వారా SGT గా చేరి 2009లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది ఫిబ్రవరి 3న విధులలో చేరారు. ఇద్దరిలో ఎవరు సీనియర్?*
- జవాబు: *పాఠశాల విద్య కమీషనర్ ఉత్తర్వులు RC NO. 142/సి3-1/11; తేదీ 19.04.2011 ప్రకారం 1995 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడే సీనియర్ అవుతాడు.*
★★★★★★★★★★★★
8.ప్రశ్న: *మా కుమారుని వయస్సు 20 సం.లు, డిఎంఎల్ టి. చదువుతున్నారు. గతంలో నేను 60 రోజులు Child కేర్ లీవు వాడుకున్నాను. మిగిలిన 120 రోజులు సెలవు ఇప్పుడు వాడుకోవచ్చా? వయోపరిమితి తొలగించారంటున్నారు వాస్తమేనా?*
- జవాబు: *ఇటీవల ఇచ్చిన ఎంఎస్ నం.36 GAD,తేదీ. 16.03. 2024 నందు To take care of the "Miner Child" అనే పదాన్ని ఉపయోగించారు. దీనివలన 18సం॥లు దాటిన పిల్లలుంటే Child care లీవు వర్తించే అవకాశం లేదు.*
Comments
Post a Comment