సంక్రాంతి తీపి జ్ఞాపకాలు
సంక్రాంతి తీపి జ్ఞాపకాలు కూతురిని రైలెక్కించి... స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైలులోని మనవలు కనుమరుగయ్యే దాకా చేయి ఊపి, అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై... నీరసంగా ఇంటికి వచ్చి, గత నాలుగు రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది... అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్దాయన. పిట్టలు రెక్కలొచ్చి ఎగిరి పోవడం సహజమే... దానికి ప్రకృతిలోని ఏ ప్రాణీ, ఇంతగా బాధపడటంలేదు కదా... మరి కాస్తోకూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము... అని ఆలోచనల్లోకి జారిపోయాడు ఆ పెద్దమనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది. కూతురి నెంబర్ చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి... అలవాటుగా అటునుంచి, కూతురు..."నాన్నా! ఇంటికి వెళ్ళిపోయారా? ఈ నాలుగు రోజులు తెగ తిరిగేసారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి. అవీ,ఇవీ అన్నీ సర్దేసి అలసిపోకండి. పనమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి, మేం వెళ్ళిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసి, సర్దిపెట్టమని పురమాయించాను... ఈలోగా మీరు కిందామీదా పడిపోకండి, సరేనా... వేళకి...

Comments
Post a Comment