Depatrmental Tests MAY-2025 Results Download Direct link

*రైలు టికెట్ల బుకింగ్ మరింత సులువు*
🌹🌹🌹🌹🌹🌹
సరికొత్త ఫీచర్లతో ‘ఐఆర్‌సీటీసీ’ యాప్
రైల్వే టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎక్కువగా ఉపయోగించే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ను ఆ సంస్థ సరికొత్త ఫీచర్లతో ఆధునికీకరించింది. ప్రయాణికులు సులువుగా రిజర్వేషన్, టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దింది. గతంలో టికెట్ బుక్ చేసుకునే సమయంలో స్టేషన్ వివరాలు నమోదు చేయగానే రైలు పేరే కనిపించేది. దానిపై క్లిక్ చేశాక తరగతిని బట్టి టికెట్ అందుబాటు, ధరల వివరాలు వచ్చేవి. అప్‌డేట్ చేసిన కొత్త వెర్షన్‌లో... ప్రయాణ వివరాలను సెర్చ్ చేయగానే రైళ్లు, ఆయా తరగతుల్లో అందుబాటులో ఉన్న బెర్తులు.. వాటి ధరలు వెంటనే ప్రత్యక్షమవుతాయి. టికెట్ కన్ఫర్మేషన్‌కు ఉన్న అవకాశాలనూ అక్కడే శాతాల రూపంలో చూపిస్తోంది. ప్రయాణికుడు బయలుదేరే స్టేషన్, చేరాల్సిన స్టేషన్ వివరాలు పంపే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్‌ను కొత్త వెర్షన్‌లో ప్రవేశపెట్టారు. దీని వల్ల ప్రయాణికుడు రెండు, మూడు అక్షరాలు నమోదు చేయగానే ఆ స్టేషన్‌తో పాటు వెళ్లాల్సిన స్టేషన్ వివరాలనూ చూపిస్తోంది. దీని వల్ల స్టేషన్ పూర్తి పేరు నమోదు చేయకుండానే వివరాలు నింపవచ్చు. రెగ్యులర్, ఫేవరెట్ జర్నీ వివరాలు వెనువెంటనే అక్కడ ప్రత్యక్షమవుతాయి. గతంలో సీట్లు అందుబాటులో ఉన్నాయనుకొని బుక్ చేసేలోపు టికెట్లు అయిపోయాయనే సందేశం కనిపించేది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. టికెట్ బుక్ చేసుకున్నాక వెయిటింగ్ జాబితా స్టేటస్ కనిపించేది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఇలా ఎక్కువగా జరిగేది. తాజాగా అప్‌గ్రేడ్ చేయడంతో ఎప్పటికప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో వెంటనే చూపిస్తోంది. పాత వెర్షన్‌లో టికెట్ బుక్ చేసుకుని, పేమెంట్ పేజీలోకి వెళ్లాక ప్రయాణ తేదీ, పేర్లు తదితర వివరాలు ఏమైనా తప్పులు ఉన్నా తెలిసేవి కాదు. ప్రస్తుతం ప్రివ్యూ చూసుకునే వెసులుబాటు ఉంది. టికెట్ రీఫండ్ వివరాలనూ హోం పేజీలోనే కేటాయించారు. కొత్త వెర్షన్‌లో సైబర్ సెక్యూరిటీకి పెద్దపీట వేశారు. టికెట్ బుక్ చేసే సమయంలో వినియోగించే డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు ప్రయాణికుడి సమ్మతితోనే వెబ్‌సైట్ నమోదు చేసుకుంటుంది. చెల్లింపులు చేసే సమయంలో వాటిని వాడుకోవచ్చు. అయితే సీవీసీ నంబరు విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
🌹🌹🌹🌹🌹🌹
Very nice
ReplyDelete